నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఎస్‌ఐఆర్ సన్నాహక సమావేశం కొరకు నిజామాబాద్ కి విచ్చేసిన కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ సమావేశ అనంతరం కృపాల్ సింగ్ నివాసానికి విచ్చేసి తేనేటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆయనతో పాటు మాజీ సివిల్ సప్లై చైర్మన్ కూడా విందుకి హాజరయ్యారు. అనంతరం పార్టీ నాయకులందరూ కలిసి కాసేపు పలు రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రఘు, అపర్ణ, సీతారాం, తదితరులు పాల్గొన్నారు.
