ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూత

బెంగళూరు, బతుకమ్మ :  ఇస్రో మాజీ చైర్మన్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కస్తూరి రంగన్ గతంలో జేఎన్ యూ ఛాన్సలర్ గా, కర్నాటక నాలెడ్జ్ కమిషన్ చైర్మన్, 1994-2003 వరకు ఇస్రో చైర్మన్ గా పని చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి కస్తూరి రంగన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు.