ఇబ్రహీంపేట్ మాజీ సర్పంచ్ హన్మాండ్లు గుండెపోటుతో మృతి

బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ ఉద్దర చిన్న హన్మాండ్లు అప్పా శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఎప్పటికప్పుడు గ్రామస్థుల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించే చతురత కలిగిన నాయకుడిగా ఆయన పేరు పొందారు. సామాన్యులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే మంచి మనిషిగా గుర్తింపు ఉంది. సర్పంచ్‌గా, ఎంపీటీసీగా గ్రామ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివని గ్రామస్థులు పేర్కొన్నారు. గ్రామ అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన నాయకుడిగా అందరి హృదయాల్లో నిలిచిపోయారని పలువురు కొనియాడారు....