Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 March 2025, 4:22 pm Posted by : ramakrishna

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు పూర్వ వైభవం

రామారెడ్డి, బతుకమ్మ :మండల కేంద్రంలోని ఎంపిపి పాఠశాలకు నూతన వైభవం సంతరించుకుంది. విద్యార్థులను ఆకర్షించేలా, ప్రత్యేకంగా 8 లక్షల రూపాయల నిధులతో పెయింటింగ్ వేయించడం జరిగింది.ఈ చర్య విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేల ఉందని,పాఠశాల వాతావరణాన్ని మెరుగుపరిచేలా ఉందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అడగగానే నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ కి కృతజ్ఞతలు తెలిపారు.ఇదే పాఠశాలలో ఎమ్మెల్యే మదన్ మోహన్ చదువుకున్నారని చదువుకున్నారని స్థానికులు తెలిపారు.