ఎంపీ అరవింద్ సమక్షంలో బీజేపీలో చేరిన మాజీ కార్పొరేటర్ సురేష్
హైదరాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సమక్షంలో మాజీ కార్పొరేటర్ పంచరెడ్డి సురేష్ బీజేపీలో చేరారు. ఆదివారం హైదరాబాద్ లోని ఎంపీ అరవింద్ స్వగృహంలో పంచరెడ్డి సురేష్ తన అనుచరులతో కలిశారు. అనంతరం పంచరెడ్డి సురేష్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్రమోడి జనాకర్షక సంక్షేమ పథకాలు, అలాగే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. అయోధ్య రామమందిర నిర్మాణాంలో హిందూ ప్రజల గుండెల్లో మోది నిలిచిపోయారన్నారు. హిందువుల కోసం పోరాడేది...