Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 January 2026, 6:54 pm Posted by : ramakrishna

ఎంపీ అరవింద్ సమక్షంలో బీజేపీలో చేరిన మాజీ కార్పొరేటర్ సురేష్

హైదరాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సమక్షంలో మాజీ కార్పొరేటర్ పంచరెడ్డి సురేష్ బీజేపీలో చేరారు. ఆదివారం హైదరాబాద్ లోని ఎంపీ అరవింద్ స్వగృహంలో  పంచరెడ్డి సురేష్ తన అనుచరులతో కలిశారు. అనంతరం పంచరెడ్డి సురేష్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్రమోడి జనాకర్షక సంక్షేమ పథకాలు, అలాగే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. అయోధ్య రామమందిర నిర్మాణాంలో హిందూ ప్రజల గుండెల్లో మోది నిలిచిపోయారన్నారు. హిందువుల కోసం పోరాడేది కేవలం  భారతీయ జనతా పార్టీయేనన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు, జిల్లాలో ఆర్ బిలో నిర్మాణాలతో ఎంపీ అరవింద్ ఇచ్చిన మాట నిలుపుకున్నారన్నారు. బీఆర్ఎస్ కుటుంబ పాలన పట్ల ప్రజలు విరక్తి చెందారని, అందుకే భారతీయ జనాత పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 16వ డివిజన్ లో నాకే ప్రజాబలం ఉందని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ మద్దతు నాకే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  ఇప్పటికే అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తను కూడా కలిసినట్లు తెలిపారు.

Former corporator Suresh joins BJP in presence of MP Arvind