ధర్మపురి, బతుకమ్మ :
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని బిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తాలు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, సిబ్బంది, స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వచనాలు అందజేశారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆశన్నగారి జీవన్ రెడ్డి ఘన స్వాగతం పలికి, ఆతిథ్యం అందించిన ఆలయ అధికారులు, సిబ్బంది, స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.