పోలీసుల అదుపులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్

హైదరాబాద్, బతుకమ్మ: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బీఆర్ ఎస్ నేత, బోధన్ మాజీఎమ్మెల్యే షకీల్ ను సీఎం ఆర్ బియ్యం కుంభకోణం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై  గతంలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. గత కొన్ని నెలలుగా షకీల్ దుబాయ్ లో ఉంటున్నారు.   షకీల్ తల్లి మృతి చెందడంతో అంత్యక్రియల కోసం గురువారం హైదారాబాద్ కు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తల్లి అంత్య క్రియల్లో పాల్గొనేందుకు ఆయనకు పోలీసులు అనుమతించారు.  ఆతర్వాత షకీల్ ను విచారించే అవకాశముంది.