Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 12:17 pm Posted by : ramakrishna

భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి కన్నుమూత

 

. . .  నర్సింహా రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం

వెబ్ డెస్క్, బతుకమ్మ:

భువనగిరి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నేత, నిరాడంబర ప్రజానేత కొమ్మిడి నరసింహారెడ్డి (83) అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మరణవార్తతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది. భూదానోద్యమం లో తన 300 ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప మానవతావాదిగా స్మరించుకుంటారు భువనగిరి ప్రజలు. 1978, 1983 సంవత్సరంలో రెండు సార్లు భువనగిరి నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహా రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నరసింహారెడ్డి తుదిశ్వాస వరకు నీతి నిజాయితీతో జీవించారని కొనియాడారు. గోదావరి జలాల సాధన, మూసీ పరిరక్షణ ఉద్యమాలను నిర్వహించి నిత్యం ప్రజల పక్షాన నిలిచారని గుర్తుచేశారు. నిరాడంబర జీవితాన్ని గడుపుతూ, అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాడిన నర్సింహారెడ్డి గారు నేటి తరానికి ఆదర్శప్రాయుడని కొనియాడారు