Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 January 2025, 4:27 pm Posted by : ramakrishna

నిజామాబాద్ వినియోగదారుల డివిజన్ కమిటీల ఏర్పాటు

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :  నిజామాబాద్ వినియోగదారుల డివిజన్ కమిటీలను ఎన్నుకున్నారు.  ఉమ్మడి నిజామాబాద్  జిల్లా ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి   జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధాన కార్యదర్శి సందు  ప్రవీణ్ అద్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా  సీసీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి  హాజరయ్యారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల డివిజన్ కార్యవర్గ సభ్యులను ప్రకటించారు.  ఉమ్మడి జిల్లా కార్యవర్గాన్ని విస్తృత పరిచే  భాగంలో నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులుగా  రాజుల రామనాథం, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులుగా పౌడపల్లి  అనిల్, బోధన్ డివిజన్ అధ్యక్షులుగా మారోజు  సుధాకర్ చారిని  నియమించారు. సాంబరాజు చక్రపాణి మాట్లాడుతూ  జిల్లాలోని గ్రామీణ స్థాయిలో ఆహార కల్తీపై చైతన్య సదస్సులను ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. ఆన్ లైన్ లో ఆహార పదార్థాలను  కొనవద్దని,  తినవద్దని  తెలిపారు. జిల్లాలోని అంగన్వాడీ సెంటర్లు ఆహార కల్తీ జరగకుండా జాగ్రత్త వహిస్తూ, ప్రజలకు సహకరించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు పెందోట అనిల్, ఉపాధ్యక్షులు వి ఎన్ వర్మ, ఉపాధ్యక్షుడు రాజుల రామనాథం, ప్రధాన కార్యదర్శి సందు ప్రవీణ్, ఆర్గనైజర్ సెక్రెటరీ మహాదేవుని శ్రీనివాస్,  సంయుక్త కార్యదర్శి గైని రత్నాకర్, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు పౌడపల్లి అనిల్, బోధన్ డివిజన్ అధ్యక్షులు సుధాకర చారి, రూరల్ ఇన్చార్జి  యాటకర్ల దేవేష్, గడప రవి కుమార్  తదితరులు పాల్గొన్నారు.