Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 8:25 pm Posted by : ramakrishna

అటవీ సంపదను కాపాడుకోవాలి

 

. . . ఇందల్వాయి రేంజ్ అధికారి రవి మోహన్ బట్ 

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటవీ సంపదను ప్రతి ఒక్కరు తెలంగాణ బిడ్డలు కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని ఇందల్వాయి రేంజ్ అధికారి రవి మోహన్ బట్ వెల్లడించారు. ఈ మేరకు గురువారం మండలంలోని ఇందల్వాయి గ్రామం తో పాటు, తీర్మాన్ పల్లి గ్రామాలలో అటవీ రెయిన్ అధికారి పరిధిలోని శిక్షణాధికారులతో పాటు బీట్ అధికారులు తదితరులు అందరు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందల్వాయి అధికారి రవి మోహన్ బట్ మాట్లాడుతూ అటవీ సంపదపై ప్రజలకు అవగాహన కోసం ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అడవికి నిప్పు పెట్టడం కానీ, అటవీ జంతువులను చంపడం కానీ, తీవ్ర నేరంగా పరిగణిస్తామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే అటవీ భూములను అన్యాక్రాంతం చేస్తూ ఆక్రమణలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనాల ర్యాలీ ఇందల్వాయి మండల కేంద్రం మీదుగా ఇందల్వాయి గ్రామంలోని ప్రధాన వీధులలో నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే తీర్మాన్ పల్లి గ్రామంలో సైతం ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రధాన వీధులలో బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగిందన్నారు, ఈ కార్యక్రమంలో సెక్షన్ అధికారులు సురేందర్, ప్రభాకర్, భాస్కర్, మానస, బీట్ అధికారులు రాకేష్, ప్రవీణ్, వంశి రాజ్ తదితరులు పాల్గొన్నారు.