Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 November 2024, 7:02 pm Posted by : ramakrishna

ఇసుక ట్రాక్టర్ ను పట్టుకున్న అటవి అధికారులు

ఇందల్వాయి, బతుకమ్మ :                                                                                                                                                       

అటవి ప్రాంతం నుంచి నిబంధనలకు విరుద్దంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను అటవి అధికారులు పట్టుకున్నారు. ఇందల్వాయి రేంజ్ పరిధిలోని హొన్నాజిపేట్, కొటాల్ పల్లి సెక్షన్ పరిధిలోని బీట్ లలో అక్రమంగా ప్రవేశించి ఇసుకను తరలిస్తున్నారని అటవి అధికారులకు సమాచారం అందింది. ఎఫ్ఆర్ వో రవిమోహన్ భట్ ఆదేశాల మేరకు మంగళవారం ఇసుకను తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను సీజ్ చేసి ఇందల్వాయి అటవి కార్యాలయానికి తరలించారు. ఈ దాడుల్లో అటవి  సెక్షన్ ఆఫీసర్ భాస్కర్, బీట్ ఆఫీసర్లు రాములు, వంశీ రాజ్,  ప్రవీణ్, దిలీప్, పోశన్నలతో పాటు బేస్  క్యాంప్ నిర్వాహకులు గణేష్, ప్రణయ్, విలాస్, ప్రవీణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.