Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 3:32 pm Posted by : ramakrishna

నిరుపేద ప్రజలకు ఫారెస్టు అధికారులు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు

 

. . .   సీపీఎం ఆద్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా

 

ఇందూర్, బతుకమ్మ :

 

నాగారం ప్రాంతవాసులకు దొడ్డి కొమురయ్య నగర్, విష్ణు నగర్ బహుజన కాలనీ, అసద్ బాబానగర్ ఏరియాలలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న నిరుపేదలకు ఫారెస్ట్ ఆఫీసర్లు గత రెండు మూడు రోజులుగా నోటీసులు ఇచ్చి ఏడు రోజుల్లో గా ఖాళీ చేయకపోతే గుడిసెలు తొలగిస్తామని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడాన్ని నిరసిస్తూ గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా  సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, నగర కార్యదర్శి బి సుజాతలు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలకు పైగా  గుడిసెలు వేసుకుని నివసిస్తున్నటువంటి నిరుపేదలని నోటీసులు ఇచ్చి ఖాళీ చేయడం తీవ్ర మనోవేదనకు  గురి చేస్తుందన్నారు. ఇప్పటికే సిసి రోడ్లు, కరెంటు స్తంభాలు, మీటర్లు, మంచినీటి కలెక్షన్లు, మురికి కాలువలు ఇలా అనేక నిర్మాణాలు జరిగినప్పటికీ ఇప్పుడు ఫారెస్ట్ ఏరియా అని ప్రజలను మనోవేదనకు గురి చేస్తున్నారని అన్నారు. ఫారెస్ట్ ఆఫీసర్స్ ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకొని ప్రజల మనోవేదనకు పరిష్కార మార్గం చూపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, గుడిసెలు వేసుకొని నివసిస్తున్న ప్రతి ఒక్కరికి  ఇంటి పట్టాలు ఇస్తామని, ఇందిరమ్మ ఇల్లు నిర్మించే ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని, బలవంతంగా ఇల్లు తొలగించి నిరుపేదలను ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, ఈ పోరాటాల్లో  జరగబోయే పరిణామాలకి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని వారు  హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు రజియా మాజిత, యశోద, జై శ్రీ, దీక్షిత,  పంచ పూల, నాస్మిన్, సుందర్,సంగీత, అంజయ్య, కాంత లక్ష్మి  గుడిసె నివాసులు తదితరులు పాల్గొన్నారు.