. . . గుండ్ల పోచమ్మపల్లిలో అపార్ట్ మెంట్ ల కోసం 61 మంది అడ్వాన్స్ లు
. . . ఒక్కొక్కరి నుంచి 45 నుంచి 60 లక్షల వసూళ్లు
. . . అధికార పార్టీ నేత నిర్వాకం బట్ట బయలు
. . . న్యాయం చేయాలని సీఎంతో పాటు ఇతరులకు లిఖిత పూర్వకంగా పిర్యాదు
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం కు చెందిన 61 మంది బాధితులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు రాసినట్టు చెబుతున్న లేఖ వ్యవహరం జిల్లాలో హట్ టాఫిక్ గా మారింది. ఆర్మూర్ నియోజక వర్గం కు చెందిన అధికార పార్టి నేత చేతిలో దారుణం గా మోసపోయిఆర్థిక నిలువు దోపిడీ కి గురై ఆత్మహత్యలు చేసుకోవడం మినహా మరో గత్యంతరం లేని నిస్సాహయ స్థితిలో 61మంది అపార్ట్ మెంట్ ప్లాట్ల బాధితులు మీకు రాయునది ఏమనగా అంటు ఓ లేటర్, విడియోలు, బాధితుల జాబితా ఒక్కటి సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. అందుకు కారణం లేకపోలేదు. ఇటివల ఆర్మూర్ నియోజకవర్గంలో జనతా గ్యారేజ్ వర్సేస్ నమస్తే ఆర్మూర్ పేరిట అధికార పార్టి నియోజకవర్గ ఇంచార్జీ వినయ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిల మద్య మాటాల యుద్ధం పరకాష్టకు చెరిన విషయం తెలిసిందే. ఓకరిపై ఒక్కరు తీవ్రమైన అవినీతి, ఆక్రమాల ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో అధికార పార్టీ చేతిలో దగా పడ్డా వారి వ్యవహరం వెలుగులోకి వచ్చింది.
మెడ్చల్ మల్కాజీగిరి జిల్లా గుండ్లపోచమ్మ గ్రామంలో పదివేల పైచిలుకు గజాల భూమిలో ఆర్మూర్ కు చెందిన అధికార పార్టి నేత వెంచర్ చేశారు. ఆ వెంచర్ లో నిర్మించే అపార్ట్ మెంట్ లో ప్లాట్లు ఇస్తామని నమ్మబలికారు. స్వయంగా నేతనే వచ్చి ఖరీదైన ప్రాంతంలో అపార్ట్ మెంట్ ప్లాట్లు ఇస్తామని ఆశజూపడంతో ఆర్మూర్ నియోజకవర్గంకు చెందిన వివిధ గ్రామాలకు చెందిన చోట మోట నాయకులు, రైతుల వద్ధ నుంచి 61 మంది దగ్గర రూ. 40 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు కోట్ల రూపాయలు వసూలు చేశారు. నాయకుడి మాటలు నమ్మి మా సొంతూళ్లలో భూములు,బంగారం అమ్మి,వడ్డీలకు తెచ్చి డబ్బును చేతిలో పెట్టారు. ఆరేళ్లయినా మాకు అపార్ట్ మెంట్ ప్లాట్లు ఇవ్వలేదు.మా ప్లాట్లు ఎప్పుడు ఇస్తారని అడగగా రేపు ఇస్తాం, మాపు ఇస్తాం అని సదరు నేత చెబుతూ వచ్చారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తరువాత ఎప్పుడు పోయి అడిగిన నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండదండలు ఉన్నాయని ,ప్లాట్లు ఇవ్వనని, ఏం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరిస్తున్నాడని భాధితులు వాపోతున్నారు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక మీ దృష్టికి తెస్తున్నాం. ఉన్నదంతా అమ్మివడ్డీలకు తెచ్చి కోట్ల రూపాయలు ఇచ్చి మేము వీధుల పాలయ్యామని. . . ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మాకు మరో మార్గం లేదని దయచేసి మీరు వెంటనే స్పందించి మా మొర ఆలకించి న్యాయం చేయాలని వేడుకుంటున్నామని ముఖ్యమంత్రి ప్రార్థిస్తున్నాం అని కోరుతున్నారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో డెవలప్ మెంట్ సంగతి దేవుడెరుగు కానీ ఎప్పుడు వివాదాలు అనే వ్యవహరం దశాబ్ధ కాలంగా సాగుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ఈ ఒరవడి కొనసాగింది. ఆనాడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డిపై కూడా వివాదాలు చుట్టుముట్టాయి. తాజాగా ఎమ్మెల్యేగా ఓటమి తర్వాత హైదరాబాద్ లోని భూముల వ్యవహరంలో కేసులు నమోదు కాగా జీవన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ ను పొందిన విషయం తెల్సిందే. గత ప్రభుత్వ హయంలోనే జరిగినట్లు తెలుస్తున్న గూండ్లపోచమ్మ పల్లిలో అపార్ట్ మెంట్ల కోసం ఆర్మూర్ వాసులు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత అధికార పార్టీ నాయకుడి చేతిలో కోట్ల రూపాయలు పెట్టి లబోదిబోమంటున్నారు. పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా అమాయకులు, రైతులు మాత్రం మోసపోతునే ఉన్నారు. అధికార పార్టీ నాయకులని చెప్పి వారిపై చర్యలకు, కేసులకు ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ వెనుకడుగు వేస్తుండడంతో బాధితులకు న్యాయం జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
