ప్రజలను ఎన్నాళ్లు “మద్యం”మత్తు లో ముంచుతారు..!
. . . మద్యాన్ని ఆదాయ వనరుగా చూసే తీరు మారేదేప్పుడు..! . . . లెక్కలు చూస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే అల్లే రమేష్, సిరిసిల్లా : అదేంటో పైకి మాత్రం రాజకీయ పార్టీలన్నీ కాసేపు జెండాలు పక్కకు పెట్టి ఆదర్శాలే మాట్లాడుతుంటాయి. ఆచరణకు వచ్చేసరికి పార్టీ ఏదైనా జెండా ఏదైనా కానీ గొంతు పెగలదు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను చూస్తే పరిస్థితులు అవే విషయాలను తెలుపుతున్నాయి. తెచ్చుకున్న తెలంగాణకు తామే అసలు సిసలు బ్రాడ్ అంబాసిడర్లమని చెప్పుకుంటున్న పార్టీలు...