Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 4:13 pm Posted by : ramakrishna

నాలుగు మండలాలకు. . . . తహసిల్దారులు ఉన్నట్లా. లేనట్లా..?

 

 . . .  వద్దన్న వారికి ఇంచార్జి బాధ్యతలు

. . . ఎన్నికల కమిషన్ కు సమాచారం ఉందో..లేదో..?

 నిజామాబాద్ , బతుకమ్మ:

నిజామాబాద్ జిల్లాలో నాలుగు మండలాల్లో తహసిల్దారులు ఉన్నాట్లా .. లేనట్లా.. అనే సందేహాలు రెవిన్యూ వర్గాల్లో నెలకొన్నాయి. జిల్లా వ్యాప్తంగా బదిలీలు జరిగినప్పటికీ ఈ మండలాలను భర్తీ  చేయలేకపోయారు. ఎస్ఐఆర్ ప్రారంభానికి ముందు కమిషన్ ఆదేశాల ప్రకారం జిల్లా వాసులు మండలాదికారులుగా ఉండరాదనే నిబందనలు ఉన్నాయని సంబంధిత ఉద్యోగులే స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ  డిప్యూటీ లకు ఇంచార్జ్ లుగా భాద్యతలు అప్పగించడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

 

 గోప్యతపై అనుమానాలు:

 

నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ నార్త్,  ఎడపల్లి, రెంజల్ మండలాల్లో డిప్యూటీ తాహసిల్దార్లే ఇంచార్జ్ తహసిల్దార్లు గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇందులో నిజామాబాద్ నార్త్, రెంజల్, ఎడపల్లి  తహసీల్దార్ లు హైదరాబాద్ కు డిప్యూటేషన్ పై  వెళ్లారు. వీరి స్థానంలో  డిప్యూటీ లకు ఇంచార్జ్ బాద్యతలను అప్పగించారు.

 

వద్దన్న వారికి:

నిజామాబాద్ రూరల్ లో చేస్తున్న డిప్యూటీ తహసిల్దార్ ను ఎన్నికల సమయంలో సొంత జిల్లాకు వెళ్ళాలని సూచిస్తే, ఇక్కడే ఉంటానని వెళ్ళలేక పోయడు. పక్క జిల్లాలో ఉన్న నిజామాబాద్ వాసులు మాత్రం సొంత జిల్లాకు చేరుకున్నారు. ఇక్కడే ఉంటానని చెప్పినప్పుడు స్థానికత కిందకు వస్తుందని, అలాంటప్పుడు రూరల్ లో  ఇంచార్జ్ తహసీల్దారుగా ఎలా నియమిస్తారనే ప్రశ్నలు వెలువడుతున్నాయి.

For four mandals... do they have Tahsildars or not?

జక్రాన్పల్లి డిటి కి ఎడపల్లి ఇంచార్జ్:

నిజామాబాద్ నార్త్, రెంజల్ మండలాల్లో అందులోనే ఉన్న డిటి లకు ఇంచార్జ్ బాద్యతలు ఇచ్చారు. ఎడపల్లి లో మాత్రం స్థానిక డిటి కి ఇవ్వకుండా జక్రాన్పల్లి డిటి కి ఇంచార్జ్ తహసిల్దార్ గా నియమించారు. తాత్కాలిక తహసిల్దార్ గా జగిత్యాల్ జిల్లాకు  వెళ్ళాలని సూచిస్తే తానూ వెళ్లనని స్పష్టం చేసిన డి టి కి ఎడపల్లి మండలానికి తహసిల్దార్ గా పంపడం పై చాటుమాటు వ్యవహారాలు నడిచాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

 బోధన్ డీటీ కి రెంజల్ ఇంచార్జ్:

రెంజల్ మండలం తహసిల్దార్ హైదరాబాద్ కు డిప్యూటేషన్ పై వెళ్లారు. అక్కడే ఉన్న డి టి ని కాదని బోధన్ ఆర్ డి ఓ లో ఉన్న డీటీ కి రెంజల్ మండలం ఇన్చార్జి తహసిల్దార్ గా నియమించారు.

 

ఎన్నికల కమిషన్ కు ..?

అన్ని మండలాల్లో సొంత జిల్లా వారు గాకుండా పక్క జిల్లా వారు మండలాదికారులుగా ఉండాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు చెబుతున్నాయి. ఈ నాలుగు మండలాల స్థానిక డిప్యూటీల గురించి  ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)  సమయంలో ఎన్నికల కమిషన్ కు రెవిన్యూ అధికారులు ఏమని చెబుతారోననే ఉత్ఖంట అందరిలోనూ నెలకొంది. ఇదంతా కలెక్టరేట్ లోని కొందరి అండదండలతోనే జరుగుతోందనే అనుమానాలు రెవిన్యూ సిబ్బంది చర్చించుకుంటున్నారు.