Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 January 2025, 7:22 pm Posted by : ramakrishna

అర్హులైన ప్రతి ఒక్కరికి..

బతుకమ్మ,మోర్తాడ్:  ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు ఈ నాలుగు పథకాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధిచే కోరుతుందని ఆర్డిఓ రాజా గౌడ్ అన్నారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో జరిగిన గ్రామ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అర్హులైన వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా దరఖాస్తులు ఇవ్వాలని అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మోర్తాడ్ తాసిల్దార్ సత్యనారాయణ, డిప్యూటీ తాసిల్దార్ సుజాత, ఏపీవో శకుంతల, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

For everyone who is eligible..