. . . మాజీ డీసీసీబీ పోచారం భాస్కర్ రెడ్డి.
బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ పట్టణం మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని మాజీ డిసిసిబి అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. బాన్సువాడ 30 ఏళ్ల క్రితం ఏవిధంగా ఉండే ,ఇప్పుడు ఏ విధంగా మారింది ఒక్కసారి ఆలోచించుకోండి అంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఒక సహకార సంఘం అధ్యక్షులుగా పనిచేసి తన స్వయం శక్తితో మంత్రిగా, శాసన సభాపతిగా ఎదిగారంటూ పోచారం భాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. గులాబీ ప్రభుత్వంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి దమ్మున్న నేతగా ఉంటూ కేసీఆర్ను ఒప్పించి ప్రభుత్వ ఖజానా నుంచి కోట్లాది రూపాయలు తీసుకువచ్చి, బాన్సు వాడ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ వరకు చేసిన ఘనత కేవలం పోచారం శ్రీనివాస్ రెడ్డికే దక్కిందని పోచారం భాస్కర్ రెడ్డి గుర్తు చేశారు. బాన్సువాడ మన్సిపల్ ఎన్నికల సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి సోమవారం పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. రెండు రోజుల క్రితం బాన్సువాడకు వచ్చిన కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను పోచారం భాస్కర్ రెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. సిరిసిల్ల అభివృద్ధికి కేటీఆర్ ఎన్ని ఎకరాలు అమ్మావు, ఇన్ని ఆస్తులు అమ్ముకొని సిరిసిల్ల అభివృద్ధి చేశావ అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు. మాట్లాడే ముందు ఒక పెద్ద మనిషి పోచారం శ్రీనివాస్ రెడ్డిని పట్టుకుని ఇష్ట రాజ్యాంగ మట్లాడడం సిగ్గు చేటుగా ఉందంటూ భాస్కర్ రెడ్డి తీవ్ర స్థాయిలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. తన తండ్రిపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే తనకు కోపం రాదా అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే కేవలం బాన్సువాడ నియోజకవర్గం తెలంగాణ లోనే అభివృద్ధిలో ముందుగా నిలబెట్టడానికి కారకులు పోచారం శ్రీనివాస్ రెడ్డి కాదా దమ్మున్న నాయకుడిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు రాబట్టి బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగంలో అభివృద్ధి చేసిన ఘనత పోచారంకి దక్కిందని పోచారం భాస్కర్ రెడ్డి వెల్లడించారు. మూడు దశాబ్దాల కాలంగా బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి ప్రాతినిధ్యం వహిస్తూ ఒకవైపు అభివృద్ధి పనులు, మరొకవైపు సంక్షేమ పథకాలను చేపడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే బాన్సువాడ మొదటి స్థానంలో నిలిపిన ఘనత పోచారం శ్రీనివాస్ రెడ్డి దే అని పోచారం భాస్కర్ రెడ్డి గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని విమర్శించడం ఎంతవరకు సమంజసం అంటూ కేటీఆర్ వ్యాఖ్యలపై భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. నిరుపేదలకు వైద్యం, విద్యార్థులకు నాణ్యమైన విద్య, వ్యవసాయ రంగానికి కావలసిన రిజర్వాయర్లు, ఇంటిగ్రేటెడ్ సమీకృత పాఠశాలలు, గురుకుల పాఠశాలలో, వసతి గృహాలు, నిరుపేదల మహిళలకు అందుబాటులో మాత శిశు ఆరోగ్య కేంద్రం, ప్రస్తుతం వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణం పనులు చేపట్టి ప్రజల్లో ఒక గుర్తింపు నాయకుడిగా పోచారం శ్రీనివాస్ రెడ్డిని బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు శీనన్నగా పిలుస్తున్నారంటే ఆయన చేసింది అభివృద్ధి ఏమిటో ఒక్కసారి తెలుసుకో కేటీఆర్ అంటూ పోచారం భాస్కర్ రెడ్డి సవాల్ విసిరారు. తన తండ్రి చేసిన అభివృద్ధిపై ఎక్కడైనా ఎప్పుడైనా ఏ రోజైనా తాను పూర్తి వివరాలుతో వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నానని పోచారం భాస్కర్ రెడ్డి సవాల్ చేశారు. ఎవరికి అందనంత ఎత్తుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన పనులే ఆయనను ఆ స్థాయికి తీసుకువచ్చాయని పోచారం భాస్కర్ రెడ్డి గుర్తు చేశారు. తన తండ్రి పట్ల ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదే లేదంటూ భాస్కర్ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు. బాన్సువాడ మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగర వేయాలని కాంగ్రెస్ కౌన్సిలర్ గా ఉంటే రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి బాన్సువాడను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని దీనిని గుర్తించి కాంగ్రెస్ అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసి అత్యధికంగా మెజార్టీతో గెలిపించాలంటూ పోచారం భాస్కర్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు.