ఇండియాలో ఫుట్‌బాల్‌కు ఉజ్వల భవిష్యత్తు
వెబ్ న్యూస్, బతుకమ్మ : భారత్ ఆతిథ్యానికి, అభిమానుల ప్రేమకి కృతజ్ఞతలని ఇన్‌స్టా వేదికగా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తెలిపారు. భారత్‌లో తన 'గోట్ టూర్'ను ముగించిన నేపథ్యంలో భారత ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 'మీ ఆత్మీయ స్వాగతం, గొప్ప ఆతిథ్యానికి ధన్యవాదాలు.. భారతదేశంలో ఫుట్‌బాల్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నా' అని ఇన్ స్టాలో మెస్సీ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.