మెనూ ప్రకారం ఆహారం అందించాలి
జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : మెనూ ప్రకారం చిన్నారులకు ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశించారు. ఆర్గొండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్నం భోజనం పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి ఆహారం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా చేతులను శుభ్రం చేసుకోవాలని, ప్రతిరోజు స్కూలుకు హాజరుకావాలని సూచించారు. వనమహోత్సవ కార్యక్రమం ద్వారా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లి పేరు మీద మొక్క నాటి ప్రతిరోజు నీళ్లు పోసి సంరక్షించాలని విద్యార్థులకు...