Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 August 2025, 7:36 pm Posted by : ramakrishna

మెనూ ప్రకారం ఆహారం అందించాలి

  • జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ : మెనూ ప్రకారం చిన్నారులకు ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశించారు. ఆర్గొండ మండల పరిషత్  ప్రాథమిక పాఠశాలను సందర్శించి  మధ్యాహ్నం భోజనం పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి ఆహారం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా చేతులను శుభ్రం చేసుకోవాలని, ప్రతిరోజు స్కూలుకు హాజరుకావాలని సూచించారు.  వనమహోత్సవ కార్యక్రమం ద్వారా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లి పేరు మీద  మొక్క నాటి ప్రతిరోజు నీళ్లు పోసి సంరక్షించాలని విద్యార్థులకు సూచించారు.

Food should be served according to the menu.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ త్వరగా పూర్తయ్యేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. ఆర్గొండ గ్రామంలో పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారు శ్యామవ్వ ఇంటి నిర్మాణ ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక, మొరం కు ఎలాంటి ప్రాబ్లం లేదని  మంజూరి అయిన అన్ని ఇండ్లు ప్రోగ్రెస్ లోనికి తీసుకు వచ్చి తొందరగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ, ఏఇ, తాసిల్దార్, ఎంపీడీవో పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Food should be served according to the menu.