బోధన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
బోధన్, బతుకమ్మ : ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006 నియమాలు, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తగిన జరిమానాలు విధించబడతాయని నిజామాబాద్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నవిత అన్నారు. మంగళవారం బోధన్ పట్టణంలోని వివిధ ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు, రెస్టారెంట్లలో ఆహార భద్రతాధికారి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలకు సంబంధించిన పలు లోపాలను గుర్తించారు. కొన్ని సంస్థల్లో సింథటిక్ ఆహార రంగులు, టేస్టింగ్ సాల్ట్ (ఎంఎస్‌జీ) వినియోగం...