Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 September 2025, 6:18 pm Posted by : ramakrishna

కె ఎఫ్ సి లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

  • శాంపిళ్ల సేకరణ..
  • కిచెన్  షెడ్డులో పరిశుభ్రత పాటించడం లేదని నిర్ధారణ

Food safety officers raid KFC

నిజామాబాద్,బతుకమ్మ : నగరంలోని వేణు మాల్ లోగల కేఎఫ్ సీ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి బుధవారం కేఎఫ్ సీల సోదాలు నిర్వహించారు. ఈ నెల 8న నగరానికి చెందిన ఒక కుటుంబం కేఎఫ్ సీలో చికెన్ ఐటం ఆర్డర్ చేసి తిన్నారు.  చికెన్ పీస్ లు కుళ్లిన వాసన వస్తుండటంతో నిర్వహకులను నిలదీశారు. అయితే నిర్వాహకులు మాత్రం ఒకటి రెండు పీసులకు మాత్రమే వాసన వస్తుందని దురుసుగా సమాధానం చెప్పారు. సంబంధిత తతంగాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది. అప్పుడే అక్కడ కొందరు చికెన్ ఐటం ను ఆర్డర్ చేసిన వారు క్యాన్సిల్ చేసుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంస్థ ఉత్పత్తులు నాసిరకంగా కుళ్లిపోయినవి కస్టమర్ లకు విక్రయిస్తున్నారని బాధితులు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Food safety officers raid KFC

నిజమాబాద్ జిల్లా కేంద్రంలోని వేణు మాల్ లో గల గత రెండు రోజుల క్రితం కుళ్ళిన చికెన్ వచ్చిందంటూ బాధితుని ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కేంద్రంలోని వేణు మాల్ లో కేఎఫ్సి లో ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ కే సునీత  ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  కేఎఫ్సి లో నిల్వ ఉన్న చికెన్, ఇతర పదార్థాలను టెస్టింగ్ కు ల్యాబ్ కు పంపినట్లు అలాగే కేఎఫ్సిలో పరిశుభ్రత లేదన్నారు. ఈ విషయంపై సంజాయిషీ (షోకాజ్) నోటీసలు ఇస్తామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.