Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 10:14 pm Posted by : ramakrishna

నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

 

. . . నిఖిల్ సాయి హోటల్ లో  కాలం చెల్లిన ఆహార పదార్థాల గుర్తింపు

 

. . . గ్లామర్ హోటల్ సీజ్

 

ఇందూర్, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మంగళవారం నగరంలోని నిఖిల్ సాయి హోటల్, మున్సిపల్ కాంప్లెక్స్ లో గల గ్లామర్ హోటల్ , కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులోని మిస్టర్ పోటెల్ మీట్ మెట్ ను మంగళవారం సాయంత్రం తనిఖీలు చేశారు.  హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ హోటల్ లో అపరిశుభ్రమైన వంటగది, సరికాని నిల్వ పద్దతులు, అధిక  బొద్దింకల బెడద, ఆహార పదార్థాలకు ఫంగస్ పట్టగడం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు లభ్యమయ్యాయి.

Food safety inspections in the city

తిలక్ గార్డెన్ కాంప్లెక్స్ లోని హోటల్ గ్లామర్ లో ఉడికించిన మాంసాన్నినిల్వ చేయడం, వంటగదిలోని పని ప్రదేశం, స్టౌవ్ లు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో హోటల్ ను అధికారులు సీజ్ చేశారు.

Food safety inspections in the city
Food safety inspections in the city

అలాగే కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులోని మెస్సర్స్ రిజువనేట్ హోటల్స్ (మిస్టర్ పొట్టెల్ మీట్ మేట్)  లో ఆహార పదార్థాలల్లో కీటకాల వ్యాప్తి, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, సరికాని నిల్వ పద్దతులు, డాక్యుమెంటేషన్ లేకపోవడం వంటివి గుర్తించారు.

Food safety inspections in the city
 

 

Food safety inspections in the city