బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్…
. . . బాన్సువాడ ఆసుపత్రికి తరలించిన విద్యార్థులు బాన్సువాడ, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి ఫుడ్ పాయిజన్ ఘటన జరిగింది.ఘటనలో సుమారు 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో9 మందికి తీవ్రమైన విరేచనాలు, వాంతులు రావడంతో కళాశాల యాజమాన్యం అప్రమత్తమైంది. వెంటనే అంబులెన్సుల ద్వారా అందరినీ బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు....