వండడానికి ముందే ఆహార పదార్థాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి
జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజనం, అల్పాహారం కలుషితం కాకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. భోజనం వండడానికి ముందే ప్రతీ రోజు క్రమం తప్పకుండా ఆహార పదార్థాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నాసిరకం, నాణ్యతా లేమితో కూడిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని ఆదేశించారు. ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను కలెక్టర్ మంగళవారం...