బోధన్ విద్యా వికాస్ జూనియర్ కళాశాలో అలరించిన ఫుడ్ ఫెస్టివల్
పూర్వీకుల ఆహార పరంపరపై విద్యార్థుల్లో అవగాహన బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఫుడ్ ఫెస్టివల్‌ను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పెద్దల కాలం నాటి సంప్రదాయ వంటకాలను రుచికరంగా తయారు చేసి ప్రదర్శించారు. ప్రతి వంటకంలోని పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను విద్యార్థులే సందర్శకులకు వివరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో మాట్లాడిన కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి వేగవంతమైన జీవనశైలిలో ప్రజలు జంక్ ఫుడ్‌లు, కల్తీ పదార్థాలు అధికంగా తీసుకోవడం...