శ్రీ కృష్ణ విద్యానికేతన్ లో ఫుడ్ ఫెస్టివల్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలో గల బ్రహ్మపురి గాజుల్ పేట్ లోని శ్రీ కృష్ణ విద్యానికేతన్ లో శనివారం ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసి ప్రదర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులు వాటిని కొనుగోలు చేసి విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.