జర్నలిస్టు అంజాగౌడ్ వర్ధంతి సందర్భంగా అన్నదానం, పండ్ల పంపిణీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సీనియర్ జర్నలిస్టు అంజాగౌడ్ 7వ వర్ధంతి సందర్బంగా ఆదివారం నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.  నగరంలోని స్నేహ సొసైటీలో మానసిక వికలాంగుల విద్యార్థులకు అన్నదానం, బిస్కెట్లు, సమోసాలు పంపిణీ చేశారు. అలాగే నగరంలోని బైపాస్ రోడ్డు, రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో  నిరాశ్రయులకు అన్నదానం నిర్వహించారు.ఈ సందర్బంగా స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య మాట్లాడుతూ అంజా గౌడ్ వర్ధంతి సందర్బంగా వికలాంగుల పిల్లలకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమన్నారు. జర్నలిస్ట్ గా సమాజం లో ప్రజలు ఎదుర్కొంటున్న  సమస్యలను...