Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 September 2025, 5:24 pm Posted by : ramakrishna

జర్నలిస్టు అంజాగౌడ్ వర్ధంతి సందర్భంగా అన్నదానం, పండ్ల పంపిణీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సీనియర్ జర్నలిస్టు అంజాగౌడ్ 7వ వర్ధంతి సందర్బంగా ఆదివారం నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.  నగరంలోని స్నేహ సొసైటీలో మానసిక వికలాంగుల విద్యార్థులకు అన్నదానం, బిస్కెట్లు, సమోసాలు పంపిణీ చేశారు. అలాగే నగరంలోని బైపాస్ రోడ్డు, రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో  నిరాశ్రయులకు అన్నదానం నిర్వహించారు.ఈ సందర్బంగా స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య మాట్లాడుతూ అంజా గౌడ్ వర్ధంతి సందర్బంగా వికలాంగుల పిల్లలకు అన్నదానం నిర్వహించడం

Food donation and fruit distribution on the occasion of the death anniversary of journalist Anja Gowda

అభినందనీయమన్నారు. జర్నలిస్ట్ గా సమాజం లో ప్రజలు ఎదుర్కొంటున్న  సమస్యలను పత్రికల్లో రాసి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కారం చేసేవారన్నారు.  పత్రికల ద్వారా సమస్యలను  వెలికితీసి ప్రజలకు, అధికారులకు, నాయకులకు మధ్య వారధిగా ఉండేవారన్నారు. అంజాగాడ్ కుమారుడు కిషోర్ గౌడ్ మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా మా తండ్రి వర్ధంతి సందర్బంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజా గౌడ్ కుటుంబ సభ్యులు కిషోర్ గౌడ్, కిరణ్ గౌడ్, నరేంద్ర గౌడ్, బింగి శుభం, సిద్దు పవర్, రమేష్, సతీష్, లవన్ కుమార్,రాహుల్ తేజ, తదితరులు పాల్గొన్నారు.

Food donation and fruit distribution on the occasion of the death anniversary of journalist Anja Gowda