విరాట్ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదానం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోనీ గాజులపేట్ లో విరాట్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండగను పురస్కరించుకొని శనివారం మధ్యాహ్నం ప్రత్యేక పూజలునిర్వహించి , కుంకుమార్చన కార్యక్రమం అనంతరం అన్నదానం నిర్వహించారు. అనంతరం వినాయకునికి పూలమాలలు వేసి నైవేద్యాన్ని సమర్పించారు.నగరం లోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పాడిపంటలతో ఆయురారోగ్యాలతో అందరు బాగుండాలని కోరారు. అలాగే వీధి వీధిలో వాడవాడలో వినాయకునికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.