బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగరంలోని గాజుల్ పేట్ లోని వీరాంజనేయ యూత్ అసోసియేషన్ వద్ద మాహ అన్న ప్రసాద కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, ఉపాధ్యక్షులు రెబ్బ ఆనంద్, జిల్లా సహ కార్యదర్శి దాత్రిక రమేష్, నగర కార్యదర్శి రాంప్రసాద్ చటర్జీ ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షుడు బాసోల్ల నికేష్, బజరంగ్దళ్ ఔదగిరి సుధీర్, సుదర్శన్, ప్రవీణ్ కుమార్, వెంకటేష్, శ్రావణ్ కుమార్, అభినయ్, శ్రీనివాస్, యూత్ సభ్యులు, కాలానీవాసులు పాల్గొన్నారు.