Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 September 2025, 7:06 pm Posted by : ramakrishna

సూపర్ గాయ్స్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో సూపర్ గాయ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇట్టి సందర్భంలో యూత్ అధ్యక్షుడు, తరుణ్, కోశాధికారి బాలు, మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గణేష్ మండపం వద్ద భజన కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే సంవత్సరం ప్రత్యేకించి చిన్న పిల్లలకు ఆటపాటలను నిర్వహిస్తూ వారికి బహుమతులు పంపిణీ చేయడానికి సూపర్ గాయ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు రంజిత్,మధు, సాయి,గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున భక్తులు మహిళలు పాల్గొన్నారు