Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 September 2025, 5:33 pm Posted by : ramakrishna

శక్తి సేన దుర్గ మండలి ముదిరాజ్ ఆధ్వర్యంలో అన్నదానం

బతుకమ్మ, ఏర్గట్ల :  మండల కేంద్రంలో తాల్లారాంపూర్ రోడ్ రేండ్ల వారి శివాలయం వద్ద శక్తి సేన దుర్గ మండలి ముదిరాజ్ ఆధ్వర్యంలో సోమవారం రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు శక్తిసేన దుర్గా మండలి ముదిరాజ్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదములు కృతజ్ఞతలు తెలిపారు. దుర్గామండలి ముదిరాజ్ యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రజలందరిపై దుర్గామాత దయ ఉండాలని అలాగే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అమ్మదయ అందరిపై ఉండాలని మనస్పూర్తిగా భగవంతున్ని వేడుకుంటున్నామని తెలిపారు.