Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 6:46 pm Posted by : ramakrishna

స్నేహ సొసైటీలో మానసిక వికలాంగ విద్యార్థులకు అన్నదానం

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

లయన్స్ క్లబ్ అఫ్ బోధన్ అయ్యప్ప సేవ ఆధ్వర్యంలో స్నేహ సొసైటీలో మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గురువారం లయన్స్ క్లబ్ మేడం సంతోష్ రెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా నిజామాబాద్ లోని స్నేహ సొసైటీ లో మానసిక వికలాంగులకు అన్నదానం నిర్వహించి బిస్కెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐ క్యాంప్ మిస్టిక్ చైర్మన్ లయన్ సూరాబత్తుని శ్రీనివాసరావు (ఎం.జె.ఎఫ్), కోశాధికారి లయన్ కంచోజీ సత్యనారాయణ, లయన్ ఇంద్ర గౌడ్, లయన్ సిద్దు, లయన్ మేడం సంతోష్ రెడ్డి, లయన్ మేడం సురేఖ, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.