Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 January 2025, 9:01 pm Posted by : ramakrishna

 ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి

 నిజామాబాద్ సిటీ బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రముఖ వస్త్ర షోరూం లపై మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. నిబంధనలకు లోబడి భారీ అంతస్తులతో షాపింగ్ మాల్ లను నిర్మించి ఇది చాలా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. చిన్న చిన్న షాపింగ్ దుకాణాలపై మున్సిపల్ అధికారులు టాక్స్ రూపంలో వసూలు చేసే అధికారులు భారీ భవనాలతో కూడిన షాపింగ్ కాంప్లెక్స్ లపై ఆస్తిపన్ను ఎంత వసూలు చేస్తున్నారో వారికి తెలియడం లేదు. కానీ ఇటీవల పేరు బజరంగ్ కావద్దని ఉద్దేశంతో నామమాత్రంగా ఓ రెండు భారీ షాపింగ్మాళ్లపై నిఘా ఏర్పాటు చేసి సంవత్సరం సంవత్సరం టాక్సీ కడుతున్నారా లేదా అనే విషయాలను పూర్తిగా షాపింగ్ మాల్ నిర్వాహకులను అడిగి తెలుసుకుంటున్నారు. ఒకవేళ మున్సిపల్ కు నిబంధనకు లోబడి పన్ను చెల్లించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చెన్నై షాపింగ్ మాల్ లపై మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టగా అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ కు చెందిన రెండు షాపింగ్ మాల్లు కిసాన్ క్లాత్, వస్త్ర ప్రపంచాలపై అధికారులు ఎందుకు కన్నెత్తి చూడడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

Follow the government rules