- ఎస్సై మహేష్
భీమ్ గల్, బతుకమ్మ : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్క వాహన చోదకుడు రోడ్ సేఫ్టీ భద్రత రూల్స్ ను పాటించాలని ఎస్సై మహేష్ సూచించారు. సోమవారం భీంగల్ లోని ప్రధాన కూడళ్ళలో రోడ్డు సేఫ్టీ మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాల మేరకు నెల రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. రొడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రొడ్డు నిబంధనలు పాటించి ప్రతి ఒక్కరు ప్రమాదాల నివారణకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమం లో ఏఎస్సై అబ్దుల్ సత్తార్, సిబ్బంది పాల్గొన్నారు.