ఎస్ఏ-1 పరీక్షల పై దృష్టి సారించాలి
నవీపేట్, బతుకమ్మ: ఉపాధ్యాయులు సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఎస్ఏ-1 పరీక్షలపై దృష్టి సారించి విద్యార్థులను సన్నద్ధం చేయాలని డీఈవో దుర్గాప్రసాద్ ఆదేశించారు. మండలంలోని మహంతం, మల్కాపూర్ ప్రభుత్వ పాఠశాలలతోపాటు మోకాన్ పల్లి కేజీబీవీని డీఈవో శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులతోపాటు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఎస్ఏ-2 పరీక్షల నిర్వహణపై ఉపాధ్యాయులకు సూచించారు.