పన్ను వసూళ్లపై దృష్టి సారించాలి

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నగర పాలక సంస్థ పని తీరుపై సమీక్ష   నిజామాబాద్, బతుకమ్మ : పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, వంద శాతం పన్ను వసూళ్లు జరగాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ పనితీరుపై శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయంలో కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ తదితర ఒక్కో విభాగం వారీగా అమలవుతున్న కార్యక్రమాలను, సాధించిన ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్ష జరిపారు. అన్ని విభాగాల మున్సిపల్...