Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 August 2025, 4:20 pm Posted by : ramakrishna

చిన్న ఎక్లార గ్రామంలోకి చేరిన వరద నీరు

  • ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు

 

మద్నూర్, బతుకమ్మ: భారీ వర్షానికి  వాగులు పొంగిపొర్లడంతో పాటు పలు గ్రామాలకులోకి నీళ్లు రావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మద్నూర్ మండలం చిన్న ఎక్లార గ్రామంలో ఉన్న వాగుకు భారీగా వరద నీరు రావడంతో గ్రామంలోకి నీళ్లు వచ్చాయి. ఆలయం, తాగునీటి ట్యాంక్  సమీపంలో నుంచి గ్రామంలోని గల్లిలోకి నీరు రావడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు.