Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 September 2025, 4:14 pm Posted by : ramakrishna

బాసరకు వరద ముప్పు

  • ఇప్పటికే పలు ఇల్లు, భవనాలు బ్యాక్ వాటర్ లో మునక

 

బాసర, బతుకమ్మ :  ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరితో బాసరకు వరద ఉప్పు పొంచి ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు బాసర గోదావరి ఉగ్ర రూపిణిగా ప్రవహిస్తూ ప్రస్తుతం ఘట్లపైకి వరద నీరు చేరుకుంది. గోదావరి– బాసర ఆలయం రహదారిలో గల పలు లాడ్జిల్లో, ఇళ్లల్లో బ్యాక్ వాటర్ చేరడంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం బాసరలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో ముఖ్యఘట్టమైన అమ్మవారు పుట్టిన మూలా నక్షత్రం రేపే కావడంతో భక్తులు అధిక సంఖ్యలో బాసర తరలివచ్చే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం బాసరను వరదలు అతలాకుతలం చేయడంతో  ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వరద నీరు బాసర ఆలయ వీధులకు చేరడానికి 100 అడుగుల దూరంలో ఉంది. దీంతో వర్తక వ్యాపారులు గతంలో జరిగిన వరద అనుభవాల దృష్టిలో పెట్టుకుని  సామాన్లను మూటగట్టుకునే పనిలో ఉన్నారు.

Flood threat to Basra

Flood threat to Basra