Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 November 2024, 5:38 pm Posted by : ramakrishna

జిల్లా వ్యాప్తంగా  ప్రారంభమైన చెకుముకి సైన్స్ సంబరాలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబరాలు 2024 లో భాగంగా గురువారం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పాఠశాల స్థాయి పరీక్షలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన 8, 9, 10 విద్యార్థులను రాబోయే నవంబర్ 21వ తేదీన మండల స్థాయి పోటీల్లో వీరికి మళ్ళీ మండల స్థాయి పరీక్ష నిర్వహించడం జరుగుతుంది అని నిర్వహకులు తెలిపారు. గురువారం పరీక్షలో భాగంగా నిజామాబాద్ నగరంలోని  బోర్గాం (పి) స్కూలు ను, ఎస్.ఎస్.ఆర్ డిస్కవరీ స్కూలు ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు చెలిమల రాజేశ్వర్, జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర సెక్రటరీ చెలిమల పద్మ, గౌరవ అధ్యక్షులు  బాసరాజేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పులి జైపాల్, తదితరులు పాల్గొన్నారు.

Flint science celebrations started across the district