నిజామాబాద్, బతుకమ్మ : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబరాల 2024 పోస్టర్ ను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతులు మీదుగా శనివారం ఆవిష్కరణ చేశారు. బాల-బాలికల విద్యా, విజ్ఞానం, వికాసం కోరకై… నవంబర్ 7న పాఠశాల స్థాయి, నవంబర్ 21న మండల స్థాయి మరియు నవంబర్ 28న జిల్లా స్థాయిల్లో సైన్స్ టెస్ట్ (సంబురాలు) నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ పరిక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్ 14,15,16 తేదిల్లో ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పులి జైపాల్, గౌరవ అధ్యక్షులు బాస రాజేశ్వర్, ఉపాధ్యక్షులు శ్రీహరి ఆచార్య, తుక్కడి నారాయణ, కోశాధికారి పండరి, న్యాయవాదులు శంకర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.