Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2024, 6:58 pm Posted by : ramakrishna

కాంగ్రెస్, బీజేపీ మధ్య ఫ్లెక్సీ వివాదం

ఆర్మూర్, బతుకమ్మ :  ఆర్మూర్  లోని పేర్కిట్ మున్సిపల్ పరిధిలోని వడ్ల కొనుగోలు కేంద్రం పరిశీలనకు వచ్చిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ను బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో జిల్లా పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ,ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫోటోలు లేకపోవడం కాంగ్రెస్, బిజెపి కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకునంది. బీజేపీ  నాయకులు ఫ్లెక్సీ లను సైతం చింపి వేశారు.  అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో పోలీసులు  ఇరు పార్టీ కార్యకర్తలను సందాయించడంతో ప్రశాంతత నెలకొంది. కాగా గత కొన్ని నెలల క్రితం మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఇందిరమ్మ కాలనీలో ఎక్సైజ్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి జూపల్లి రాకమందు కార్యకర్తలు రసభస చేశారు.