Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 August 2024, 4:23 pm Posted by : ramakrishna

ఎల్లారెడ్డి లో ఫ్లెక్సీ వివాదం

బతుకమ్మ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజక వర్గ  కేంద్రంలో ఫ్లెక్సీ వివాదం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి కేంద్రం లోని వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఇంటి వద్ద ఆయన అనుచరులు శుక్రవారం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీ లో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఫోటో లేదని ఆయన అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపిస్తూ ఫ్లెక్సీలు తొలగించారు. షబ్బీర్ అలీ, శుభాష్ రెడ్డి ఫొటోలు కూడా ఎమ్మెల్యే మదన్ మోహన్ అనుచరులుఫ్లెక్సీ లో పెట్టడం లేదని సుభాష్ రెడ్డి అనుచరులు ఆరోపించారు. దీంతో కొద్దిసేపు అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే మదన్ మోహన్, సుభాష్ రెడ్డి గ్రూప్ రాజకీయాలతో  ఎల్లారెడ్డి నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ డీలా పడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.

Flexi controversy in Ellareddy