Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 6:46 pm Posted by : ramakrishna

జగిత్యాల కమలంలో అసంతృప్తి సెగలు

 

. . . పార్టీ లైన్ దాటిన వారిపై చర్యలు తీసుకోకపోవడంతో బీజేపీలో అసంతృప్తి

. . . రాష్ట్ర నాయకత్వం తో తాడోపెడుకు సిద్ధమైన కషాయం క్యాడర్

. . . రేపు 500 వాహనాలలో రాష్ట్ర హై కమాండ్ చెంతకు

జగిత్యాల, బతుకమ్మ:

కట్టర్ పార్టీగా పెరుగడించిన కమలం పార్టిలో లీడర్లే గీత దాటితే చర్యలు తీసుకోరా.. రాష్ట్రస్థాయి పోస్టులలో ఉంటూ జాతీయ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్న, పార్టీ లైన్ దాటిన, ప్రత్యర్థి పార్టి లీడర్లతో రాసుకు పుసుకు తీరుగుతున్న యాక్షన్ తీసుకోకపోవడంపై పార్టి క్యాడర్ లో అసంతృప్తి సెగలు వెల్లువెత్తున్నాయి. ఈ విషయంలో ఏకంగా రాష్ట్ర నాయకత్వంకు ఫిర్యాదు చేసినా స్పంధించకపోవడంతో అది నాయకత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు కాషాయ పార్టీ నేతలు బుధవారం చలో హైదరబాద్ కు పిలుపునిచ్చారు. ఈ వ్యవహరం జగిత్యాల బిజేపిలో ప్రధానంగా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కలకం రేపుతోంది.

జగిత్యాల జిల్లా కమలం పార్టిలోలో కొంతకాలంగా కొనసాగుతున్న పార్టీ అంతర్గత వ్యవహారం ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకత్వం వద్దకు చేరే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురభి నవీన్ కుమార్, జిల్లా నాయకుడు ముదుగంటి రవీందర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు మోరేపల్లి సత్యనారాయణపై ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి పలుమార్లు అధికారికంగా ఫిర్యాదులు వెళ్లినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బల్ధియా ఎన్నికల తరువాత జరిగిన వరుస ఘటనల నేపథ్యం అందుకు  కారణం. జగిత్యాల నియోజకవర్గ నాయకురాలు భోగ శ్రావణి ఇంటిపై దాడి ఘటన, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురికి వ్యతిరేకంగా నిర్వహించినట్లు చెబుతున్న మీడియా సమావేశాలు, అలాగే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో మోరెపల్లి సత్యనారాయణకు ఉన్న సన్నిహిత సంబంధాలు, కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నారనే ఆరోపణలు ప్రధానంగా రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లిన అంశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇన్ని ఫిర్యాదులు వెళ్లినప్పటికీ ఇప్పటివరకు రాష్ట్ర నాయకత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన చర్యలు లేకపోవడంపై పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు సమాచారం. మరోవైపు తమ కార్యక్రమాల వెనక  కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారని సురభి నవీన్ పార్టీ శ్రేణులకు, స్థానిక మీడియాకి బహిరంగంగా వివరించడం మరింత చర్చకు దారి తీసింది. జగిత్యాల జిల్లాలో బిజేపిలో అసమ్మతి క్యాడర్ ను పెంచిపోషించడం పై కమలనాధులు పార్టి హై కమాండ్ పై గుర్రుగా ఉన్నారు. బండి భగీరథ్ ఉధంతం అనంతరం జరిగిన పోష్టర్ ల వివాధం కు ప్రధానంగా చర్చనీయంగా మారిన విషయం తెలిసిందే. ఓకప్పటి కరీంనగర్ పూర్వపు జిల్లాలోని నూతన జగిత్యాల జిల్లాలో బిజేపి క్యాడర్ లో గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహించడంపై లీడర్,క్యాడర్ ల మద్య గ్యాప్ కు కారకులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నలు తలెత్తాయి.

దీంతో ఇక రాష్ట్ర నాయకత్వానికి తమ అసంతృప్తిని నేరుగా తెలియజేయాలని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ శ్రేణులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. రేపు సుమారు 500 కార్లతో రాష్ట్ర నాయకత్వాన్ని కలిసి, ఇప్పటికే చేసిన ఫిర్యాదులపై  చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అంటూ అడిగేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల కంటే పార్టీ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తే క్షేత్రస్థాయిలో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదులపై రాష్ట్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? 500 కార్లతో జరగనున్న ఈ కార్యక్రమం తర్వాత బీజేపీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

flames-of-discontent-within-the-jagtial-bjp-unit
flames-of-discontent-within-the-jagtial-bjp-unit