బోధన్‌లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ

  బోధన్, బతుకమ్మ :   సీపీ ఆదేశాల మేరకు బోధన్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా శనివారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. బీటీ నగర్, రెంజల్ బేస్, ద్యాకం గల్లి, తట్టికోట ప్రాంతాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలకు భద్రతపై నమ్మకం కల్పించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు బోధన్ సీఐ వెంకట్ నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ బోధన్ శ్రీనివాస్,...