ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఫ్లాగ్ మార్చ్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈ నెల 27న జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా శనివారం ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని ఐదో టౌన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. నగరంలో మత సామరస్యం కాపాడడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐపీ సౌత్ రూరల్ సురేష్, టౌన్ 5 ఎస్సై  గంగాధర్, టౌన్ 6 ఎస్సై వెంకటరావు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, స్పెషల్ పార్టీ, సివిల్ ఫోర్స్, దాదాపు 100 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.