మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాల నిర్వహణ

  . . . పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య వెల్లడి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జిల్లాలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఆయన ఆదేశాల మేరకు శాంతిభద్రతలు పరిరక్షించడం, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ ఫ్లాగ్ మార్చ్ చేపట్టినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీంగల్ లోని...