ఘనంగా ధ్వజారోహణం, గరుడ పఠాదివాసం

భీమ్ గల్, బతుకమ్మ : లింబాద్రి గుట్ట పై శ్రీ లక్ష్మీ నృసింహుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన బుధవారం అర్చకులు ధ్వజారో హనం, గరుడ పాఠాదివాసం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారుఈ ఉత్సవాలలో ముందుగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించి, స్వామివారి కల్యాణ మండపంలో గరుఢ పఠంపై స్వామివారి ఉత్సవ మూర్తుల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించి యజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన మహాపూజ, హోమాన్ని క్రియారూపంచే నిర్వహించారు. పట్టు వస్త్రంపై హోమపూజ నిర్వహించి సప్తదశ కలశ స్థాపన, శోడషోపచారముల...